ఈ.వి.యం గోదాముకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఈ.వి.యం గోదాముకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి మండల తహసిల్దార్ కార్యాలయం వెనుకభాగంలో ఉన్న ఈ.వి.యం గోదాం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ఈ వి.యం ల భద్రతను పరిశీలించారు. ఆజ్ఞాపక యంత్రాలు, సి.సి. టివి లతో ఉన్న భద్రతను పరిశీలించారు. పోలీస్ బందోబస్తు ఎలా ఉంది, విధుల నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు. ఈ.వి.యం. ల భద్రత పై ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు బిజెపి నుంచి పెద్దిరాజు, టిడిపి నుంచి కొత్తపల్లి శంకర్, బీఎస్పీ కుమార స్వామి, కాంగ్రెస్ నుండి ఎన్ త్రినాథ్, సిపిఎం పరమేశ్వర చారి, టిఆర్ఎస్ జమీల్ తదితరులు పాల్గొన్నారు. (Story:ఈ.వి.యం గోదాముకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి)

