అభివృద్ధి చేస్తాం అవకాశం ఇవ్వండి
న్యూస్తెలుగు/వనపర్తి : గణపురం మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రాళ్ళ. కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది.ఇట్టి సమావేశములో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఘనపురం మండలం కేంద్రాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని అభివృద్ధి ద్యేయంగా తన మన తారతమ్యం లేకుండా పని చేశామని ఓటు అడిగే నైతిక హక్కు మనకే ఉందని స్పష్టం చేశారు. కె.సి.ఆర్ గారికి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను రైతులకు రైతు భరోసా ఏదని,మహిళకు 2500,ఆసరా పింఛన్లు 4000,తులం బంగారం,విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్,కె.సి.ఆర్ కిట్టు , కంటివెలుగు, బతుకమ్మ పండుగ చీరలు ఏమయినాయి అని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశములో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story:అభివృద్ధి చేస్తాం అవకాశం ఇవ్వండి)

