భవిత సెంటర్ కు జమాల్ ఖాన్ భరోసా..
అంగవైకల్య పిల్లలకు ఆసరా
న్యూస్ తెలుగు/చింతూరు : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ తెలుగుదేశం మండల అధ్యక్షులు మహమ్మద్ జమాల్ ఖాన్ ఐ ఇ ర్ సి. భవిత సెంటర్ ను సందర్శించినారు. భవిత సెంటర్ కు తన వంతు భరోసా ఆసరా ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ వికలాంగుల పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వికలాంగ పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు భోజన ఏర్పాట్లు చేసి 35 మంది వికలాంగ పిల్లలకు రగ్గులను అందజేశారు. చలికాలం కావడంతో పిల్లలు చలికి ఇబ్బంది పడుతున్నారని గుర్తించి ఆయన స్వయంగా భవిత సెంటర్ నిర్వాహకులకు అందజేశారు. మానసిక శారీరక వికలాంగులు పట్ల అందరూ మానవత్వంతో తగిన సహాయం చేయాలని భగవంతుడు అన్ని అవయవాలతో పరిపుష్టిగా సృష్టించిన మనుషులు వారిపట్ల దయా కరుణ చూపించాలని తెలిపారు. అంగవైకల్యం మనుషులకు అడ్డంకి కాదని ఎంతోమంది ఈ భవిత సెంటర్ నుండి పదవ తరగతి, ఉన్నత చదువులను అభ్యసించడం పట్ల ఆయన నిర్వహకులను అభినందించారు. వికలాంగుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఎంతో గొప్పదని ఎంతో ఓర్పు సహనం కావాలని అంతటి అవకాశం కలగటం కూడా అదృష్టమేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి జహంగీర్, సాల్మన్ రాజు,జానీ, ట్రస్ట్ సభ్యులు, భవిత సెంటర్ నిర్వాహకులు శ్యాంసుందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.(Story:భవిత సెంటర్ కు జమాల్ ఖాన్ భరోసా..)

