చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అక్షరాస్యత పై అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు/చింతూరు :చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యుఎసి ఆధ్వర్యంలో ఏక్సిస్ పాయింట్ సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ వారి సహకారంతో ప్రధానమంత్రి ఉచ్చతార్ అభియాన్ స్కీమ్ ఆర్థిక సహకారంతో బుధవారం కంప్యూటర్ అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం తెలియజేశారు. ఏక్సిస్ పాయింట్ సాఫ్ట్ వేర్ నుండి రావూరి వేణు, రిసోర్స్ పర్సన్స్ గా ఎన్. ఆనంద్, రాపాక కిరణ్మయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్. ఆనంద్ మాట్లాడుతూ కంప్యూటర్ విద్య ప్రాముఖ్యతను అందరికీ చేరవేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అని, ప్రతిరంగంలో కంప్యూటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. ఆర్.కిరణ్మయి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో పోటీ పరీక్షలు రాయాలన్నా, ఉద్యోగం సాధించాలన్నా కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరమని, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎమ్. శేఖర్, కోఆర్డినేటర్ డాక్టర్.వై.పద్మ, డాక్టర్. కె శకుంతల, జి. హారతి, కె. శైలజ, జి. సాయికుమార్, ఆర్. మౌనిక, బి. శ్రీనివాసరావు, లక్ష్మీ ప్రసన్నకుమారి, కీర్తి అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.(Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అక్షరాస్యత పై అవగాహన సదస్సు)

