పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా అలర్ట్ అయిన పోలీసులు
ముమ్మరంగా వాహనాల తనిఖీ
న్యూస్ తెలుగు/చింతూరు : పీపుల్స్ లిబరేషన్ గేరెల్లా ఆర్మీ వారోత్సవాలు 2వ తేది నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న సందర్భంగా చింతూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. చింతూరు నుండి ఏడుగురాళ్లపల్లి మీదుగా భద్రాచలం వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా మళ్ళిస్తున్నారు. అలాగే రాత్రుళ్ళు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన కుగ్రామాలలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరించితే తమకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్, ఏఎన్ఎస్ నేతృత్వంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహార కాస్తున్నట్లు ఎస్సై తెలిపారు.(Story:పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా అలర్ట్ అయిన పోలీసులు)

