సిపిఐ పల్నాడు జిల్లా జనరల్ బాడీ సమావేశం
న్యూస్ తెలుగు / వినుకొండ :
భారత కమ్యూనిస్టు పార్టీ సి పి ఐ పల్నాడు జిల్లా జనరల్ బాడీ సమావేశం ఈనెల డిసెంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు గురజాల నియోజకవర్గం దాచేపల్లి లోని నారాయణపురం సిపిఐ ఫంక్షన్ హాలులో జరుగుతుందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ తెలిపారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా జనవరి 18వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణము నందు జరుగనున్న సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవాల ర్యాలీ బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ డి. రాజా, పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ, జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ, తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఇరు రాష్ట్రాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని, పార్టీ శాఖల సమావేశాలు పార్టీ సభ్యత్వం నిధి వసూలు తదితరాలు చర్చించబడతాయి. కావున పార్టీ సభ్యులందరూ సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. ఆయా నియోజకవర్గాల కార్యదర్శులు బాధ్యతగా నాయకులు ప్రజా సంఘాల బాధ్యులు సభ్యులందరూ హాజరయ్యే విధంగా తగు కార్యచరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.(Story:సిపిఐ పల్నాడు జిల్లా జనరల్ బాడీ సమావేశం)

