Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ లో స్వచ్ఛఆంధ్ర- స్వర్ణాంధ్ర పై అవగాహన

వినుకొండ లో స్వచ్ఛఆంధ్ర- స్వర్ణాంధ్ర పై అవగాహన

వినుకొండ లో స్వచ్ఛఆంధ్ర- స్వర్ణాంధ్ర పై అవగాహన

న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కృతిక శుక్ల ఐఏఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా. షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్వచ్ఛఆంధ్ర- స్వర్ణాంధ్ర డిసెంబర్ నెల థీమ్ మరియు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వెల్లటూరు రోడ్ నందు శర్మ స్కూల్ లో విద్యార్థులకు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసరచన పోటీలు మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ. 1984 భోపాల్ గ్యాస్ విపత్తు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటున్నామని, కాలుష్య నియంత్రణ మన బాధ్యత అని, కావున వారంలో ఒకరోజైనా ప్రజలు తమ రోజు వారి విధులకు కార్లు లేదా మోటర్ సైకిల్ వాడకుండా సైకిల్ వాడాలని తెలిపారు. అలాగే ఈ కాలుష్య నియంత్రణ లో చెట్లు చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి, కావున చెట్లను నాటాలని కోరారు. మరియు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ వినుకొండను సాధించేందుకు తమ వంతుగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బదులు జూట్ మరియు క్లాత్ బ్యాగ్స్ వాడాలని, ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శర్మ స్కూల్ ప్రిన్సిపాల్ శర్మ మాట్లాడుతూ. ప్రస్తుతకాలంలో కాలుష్యం పెగడనికి పరిశ్రమలు ప్రధాన కారణంగా ఉన్నాయన్నారు. ఆధునిక కాలంలో మనం ఉపయోగించే ఏసీలు, ఫ్రిడ్జ్ వల్ల పర్యావరణ కాలుషితం అవుతుందని , భావి తరాలకు మంచి వాతావరణం అందించడం మనందరి బాధ్యతనీ, అందుకొరకు కృషి చెయ్యాలన్నారు. తదుపరి శానిటరీ ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సెక్రటరీ రవి, శర్మ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేస్త్రీలు, తదితరులు పాల్గొన్నారు.(Story:వినుకొండ లో స్వచ్ఛఆంధ్ర- స్వర్ణాంధ్ర పై అవగాహన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!