పాతపల్లి గ్రామ అభివృద్ధికి నా పూర్తి సహకారం
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామము నుండి ఎనుముల చైతన్య భారతి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నుండి 50మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి నిరంజన్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చైతన్య భారతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మాకు ఎటువంటి అభివృద్ధికాని,వ్యక్తిగత పనులు కూడా జరగలేదని అందుకే బి.ఆర్.ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం అని నమ్మి పార్టీలో చేరుతున్నాం అని చైతన్య భారతి అన్నారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతములో పాతపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టీ అభివృద్ధి చేశామని నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినందుకు మీకు అండగా ఉండి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఐకమత్యంతో గ్రామ సర్పంచిగా చైతన్య భారతి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,నందిమల్ల.అశోక్,ఆవుల.రమేష్,చిట్యాల.రాము గ్రామ నాయకులు వెంకటయ్య,గోవిందు,ఎం.నాగేష్,కరుణాకర్,శ్రీనివాసులు,ఆశన్న,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.(Story : పాతపల్లి గ్రామ అభివృద్ధికి నా పూర్తి సహకారం )

