వృద్ధ దంపతులకు ఇంటి నిర్మాణానికి జె కె ట్రస్ట్ రేకులు పైపులు వితరణ
న్యూస్ తెలుగు/చింతూరు :
చింతూరు మండల కేంద్రంలోని ఓడ బజార్లో గత వరదలకు పచ్చిక నారాయణ వృద్ధ దంపతుల ఇల్లు పడిపోవడంతో నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న వృద్ధ దంపతుల గురించి జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఆదివారం ఇంటి నిర్మాణానికి కావాల్సిన పది సిమెంట్ రేకులు 10 ఇనుప పైపులను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహీద్, జాన్ సుందర్, షేక్ షరీఫ్,ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. (Story:వృద్ధ దంపతులకు ఇంటి నిర్మాణానికి జె కె ట్రస్ట్ రేకులు పైపులు వితరణ)

