నరగాయపాలెంలో రైతన్న మీకోసం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండలంలోని నరగాయ పాలెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం లో భాగంగా వినుకొండ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్.ఎన్. శ్రీరాములు, వినుకొండ ఉద్యానవనాధికారి నబి రసూల్ మండల వ్యవసాయ అధికారి జి.వరలక్ష్మి పాల్గొన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ. శాఖ ద్వారా అమలుపరచబడుతున్న సేవలను వివరించారు. ఉద్యాన వన అధికారి డ్రిప్పు, స్ప్రింక్లర్లు, పైపులు సబ్సిడీ మీద అందిచబడుతుందని రైతు సోదరులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి మాట్లాడుతూ. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ లబ్ది గూర్చి రైతులకు వివరించారు.. ప్రతి రైతు ఈ సర్వేలో పాల్గొనలని, వీటివల్ల కలిగే ఉపయోగాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతు సోదరులు ఏపీఎంఐపీ అధికారులు పాల్గొన్నారు.(Story :నరగాయపాలెంలో రైతన్న మీకోసం )

