నవంబర్ 26 నరసరావుపేట లో జరిగే ట్రాక్టర్ బైకు ర్యాలీను జయప్రదం చేయండి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు కాకర్ల కొండలు అధ్యక్షతన స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో మంగళవారం రైతులతో సమావేశం జరిగిండి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. మోడీ 2014 వ సంవత్సరంలో మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఇప్పటికి 12 సంవత్సరాలయిందని, ఈరోజుకి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ రైతుల ఆత్మహత్యలు రెట్టింపైయ్యాయని, రైతులు వాడే ఎరువులు ధరలు రెట్టింపైయ్యాయని, కార్మికుల హక్కులను హరింపజేసే లేబర్ కోళ్లను తీసుకొచ్చి కార్మికుల స్వేచ్ఛను కాలరాయాలని చూస్తున్నారని, వీటన్నిటి పైన బుధవారం జరిగే కర్షక కార్మికుల ట్రాక్టర్ బైక్ ర్యాలీలను పల్నాడు జిల్లా రైతులు, కార్మికులు జయప్రదం చేయాలని రాము కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, పెద్దారావు, బ్రహ్మం, లక్ష్మి, భద్రయ్య, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, కిరణ్, రామయ్య, సుబ్బారావు, నాగయ్య, మల్లయ్య, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story : నవంబర్ 26 నరసరావుపేట లో జరిగే ట్రాక్టర్ బైకు ర్యాలీను జయప్రదం చేయండి )
