Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్ని అభివృద్ధి పథకాలు మహిళలకే

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్ని అభివృద్ధి పథకాలు మహిళలకే

0

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్ని అభివృద్ధి పథకాలు మహిళలకే

న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడమే కాకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకే ఇచ్చి మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా ఇందిరమ్మ పాలనలో మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే కాకుండా వారి కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా అన్నారు. మంగళవారం పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాలకు సంబంధించిన ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని పెబ్బేరు మండలం వల్లపు రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించగా శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి మొదటి సంతకం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పై పెట్టడం జరిగిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం, అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్లరేషన్ కార్డు, రేషన్ కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం జరుగుతోందన్నారు. రైతులకు రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు క్వింటాలుకు 500 బోనస్ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకే ఇస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, పాఠశాలలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, వడ్ల కొనుగోలు కేంద్రాలు మహిళలకే అప్పగించడం, ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరున మంజూరు చేయడం, పెట్రోల్ పంపు, ఆర్టీసీ బస్సులకు యజమానులు చేయడం, సోలార్ యూనిట్, మహిళా క్యాంటీన్ లు తదితర అన్ని రంగాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నేడు మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా వారి కుటుంబాలు, తద్వారా గ్రామాలు బాగుపడుతున్నాయని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, తద్వారా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం లేదని చెప్పారు.18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళకు నాణ్యమైన ఇందిరమ్మ చీర ఇవ్వడం జరుగుతుందని, ఇది మహిళా సంఘాల సభ్యుల ఆత్మగౌరవం ఇనుమడింపజేస్తుందనీ పేర్కొన్నారు.వనపర్తి జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 3.12 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని అందులో వనపర్తి నియోజకవర్గానికి రూ. 1,24,95,000 లు మహిళల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా ఎంపిక చేసినవి నాణ్యమైన చీరలు ఇందిరా మహిళా శక్తి చీర గా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘంలో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని అందువల్ల ప్రస్తుతం మహిళా సంఘాల్లో లేని వాళ్ళని సైతం సంఘంలో చేర్చుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు క్యాంటీన్ లు, పెట్రోల్ బంక్, ఆర్టీసీ బస్సులు, వడ్ల కొనుగోలు కేంద్రాలు వంటి పనులు అప్పజెప్పడం జరుగుతుందని ఇంకా ఏదైనా వ్యాపారం చేయాలని ఆసక్తి ఉంటే తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఓ ఉమాదేవి, బి.సి. సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ పెబ్బేరు తహసిల్దార్ మురళి, శ్రీరంగాపూర్ తహసిల్దార్ రాజు, ఎంపీడీఓ వెంకటేష్, మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య చైర్మన్ స్వరూప, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు శ్రీలత, పద్మమ్మ, అక్కమ్మ, మహిళా సంఘాల సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.(Story : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్ని అభివృద్ధి పథకాలు మహిళలకే )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version