Home వార్తలు తెలంగాణ వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి. సునిత

వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి. సునిత

0

వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి. సునిత

న్యూస్‌తెలుగు/వనపర్తి : సోమవారం వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి డి. సునిత, అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం ముందుగా వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు గారు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నూతన ఎస్పీ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి. కార్యాలయంలో పదవీ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు మరింత చేరువగా ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని తెలిపారు. పారదర్శక పాలన, సమర్థమైన నేర నివారణ, సాంకేతిక ఆధారిత సమాచార వ్యవస్థలతో పోలీసు విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు స్పష్టమైన న్యాయం, వేగవంతమైన సేవ, భద్రతాభావం కల్పించడం పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. డ్రగ్ మాఫియా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, అసాంఘిక ప్రవర్తనపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వనపర్తి ప్రజల గౌరవం, భద్రత, ప్రశాంతత మా మొదటి ప్రాధాన్యం. మహిళలు, పిల్లలు భయం లేకుండా జీవించే వాతావరణం కల్పించడం పోలీసు శాఖ బాధ్యత. చట్టం ముందు అందరూ సమానమే. ప్రజల నమ్మకం పెరిగితేనే సమర్థ, ప్రభావవంతమైన పోలీసింగ్ సాధ్యం” అని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్‌ కార్యకలాపాలు, ప్రమోషన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. ఇటువంటి ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డ్రంక్ & డ్రైవింగ్, ఓవర్‌స్పీడింగ్‌పై జీరో టోలరెన్స్ అమలు చేస్తామని ఎస్పీ గారు పేర్కొన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాను రాష్ట్రంలో భద్రతా పరంగా ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులు నూతన ఎస్పీ గారిని అపోలో మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. (Story:వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డి. సునిత)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version