Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ “చెకుముకి సైన్స్ సంబరాలు” ప్రతిభా పరీక్షలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన గీతమ్స్ విద్యార్థులు..

“చెకుముకి సైన్స్ సంబరాలు” ప్రతిభా పరీక్షలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన గీతమ్స్ విద్యార్థులు..

0

“చెకుముకి సైన్స్ సంబరాలు” ప్రతిభా పరీక్షలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన గీతమ్స్ విద్యార్థులు..

న్యూస్ తెలుగు /వినుకొండ : జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేటలోని సాధినేని చౌదరయ్య రెసిడెన్షియల్ పాఠశాలలో పల్నాడు జిల్లాస్థాయిలో నిర్వహించిన చెకుముకి సైన్స్ సంబరాలు ప్రతిభా పోటీ పరీక్షలలో గీతమ్స్ హైస్కూల్ విద్యార్థులు “రాష్ట్రస్థాయి” కి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ ఎం. కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వినుకొండ పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై రాష్ట్రస్థాయికి ఎంపికైన వి. యశస్విని, ఏ. సోఫియా, ఎస్.కె. షారుక్, లను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేందుకు ఇటువంటి ప్రతిభా పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ. డిసెంబర్ 22, 23 తేదీలలో రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలు జరుగుతాయని వాటిలో కూడా ప్రతిభ చూపి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.(Story:”చెకుముకి సైన్స్ సంబరాలు” ప్రతిభా పరీక్షలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన గీతమ్స్ విద్యార్థులు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version