కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలి
మారుతి వరప్రసాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి
న్యూస్ తెలుగు /వినుకొండ : కార్మికులు దశాబ్దాల పాటు విరోచత పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాయుటకు దుర్మార్గంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు వినుకొండ పట్టణం లోని మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల మస్టర్ సమయంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 2014లో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా వచ్చింది మొదలుకొని ప్రభుత్వ రంగ పరిశ్రమలలో అనేక రకాల వస్తువుల ఉత్పత్తి కారకులు కార్మికుల పైన దేశ ప్రజలకు పట్టెడన్నం పెడుతున్న రైతులపైన అనేక నల్ల చట్టాలు తెచ్చి వారి హక్కులను హరింపజేసిన నేపథ్యం జరిగింది దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు రైతాంగం కార్మికులు దానికి వ్యతిరేకంగా నల్ల చట్టాలు ఎత్తివేయాలని సుదీర్ఘ పోరాటం నిర్వహించారని దేశ ప్రజల ఆగ్రహ వేశాలు చవిచూసిన ప్రధాని నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని ఈనాడు మరల కార్మికుల చట్టాలను కాలరాయుటకు నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఎత్తివేస్తున్నారని దీనిని సభ్య సమాజం ప్రజలు రైతులు కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించి పోరాట కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలువరించాలని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం దేశంలో ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా తీసుకొని రాలేదని గత ప్రభుత్వాల కాలంలో వేలాది ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని ప్రైవేటు వ్యక్తులకు అంబానీ ఆదానీ లాంటి వారికి అప్పజెప్పుటకు కుట్రపాన్ని దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారు చౌకగా అమ్మి వేస్తున్నారని ఆ రంగాలలో పనిచేయుచున్న కార్మికులను వీధిన పడే వేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు ఐక్య పోరాటాలు ఒక్కటే శరణ్యమని ఆయన అన్నారు. ఏఐటియుసి నాయకులు బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పిన్న బోయిన వెంకటేశ్వర్లు, కే మల్లికార్జునరావు, కార్మిక నాయకులు సంపెంగుల అబ్రహం రాజు, రాచపూడి ఏసు పాదం, కంచర్ల కోటేశ్వరరావు, కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి)

