ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
ప్రజా దర్బార్ కు వినతుల వెల్లువ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులుకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. వినుకొండ పట్టణముతోపాటు గ్రామాల్లో సిసి రోడ్లు, విద్యుత్తు డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు. సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తూ ప్రజా ప్రభుత్వం గా ప్రజల మన్ననలు పొందిందన్నారు. (Story:ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం )

