Home వార్తలు తెలంగాణ పరిపాలనను ప్రజల చెంతకు తెచ్చిన ఘనత కె.సి.ఆర్ గారిది

పరిపాలనను ప్రజల చెంతకు తెచ్చిన ఘనత కె.సి.ఆర్ గారిది

0

పరిపాలనను ప్రజల చెంతకు తెచ్చిన ఘనత కె.సి.ఆర్ గారిది

న్యూస్ తెలుగు/వనపర్తి : రెవెల్లి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు నాగపూర్ గ్రామములో జరిగింది.ఇట్టి సమావేశానికి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు 420హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతికత లేదని గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.కె.సి.ఆర్ తెలంగాణ సాధించిన తర్వాత ప్రణాళిక బద్దంగా రాష్ట్ర అభివృద్ధి సాధించారని రైతాంగానికి సాగునీళ్లు,ఉచిత కరెంట్,పెట్టుబడి సాయం చేస్తూ కోటి ఎకరాలకు సాగు నీరు అందించారని కొనియాడారు ఉత్పత్తులు పెరిగి జీవనోపాధి కలిగి రైతులు రాజులా బ్రతికారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా అందకు సాగునీళ్ళు,కరెంట్ అందక 700మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశములో రైతు బంధు,రైతు రుణ మాఫీ,రైతు బీమా అందించిన గొప్ప నాయకుడు కే.సి. ఆర్ అని 1000గురుకులాలు స్థాపించి ఎస్.సి,ఎస్.టి,బి. సి,మైనార్టీలకు ఉన్నత విద్యావంతులను చేశారని ప్రజలకు పాలన అందుబాటులోకి రావాలి అని జిల్లా కలెక్టరేట్ లు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. 32వేల కోట్లు ఖర్చు పెట్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కె.సి.ఆర్ గారు 90శాతం పూర్తి చేశారని కేవలం 1000కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ పూర్తి అయి 12లక్షల ఎకరాలకు నీళ్లు అందించవచ్చని కానీ కాంగ్రెస్ పార్టీకి పాలమూరు పచ్చబడడం ఇష్టం లేక పడావు పెట్టారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.ఉమ్మడి గోపాల్ పేట మండలములో పరిపాలన ప్రజల చెంతకు రావాలని రెవెల్లి,ఎద్దుల మండలాలు ఏర్పాటు చేశానని,ఆంజనేయుని గుడిలోని గ్రామము లేనట్లుగానే మన అభివృద్ధి పథకం తెలీని గ్రామము కూడా లేదని పునరుద్ఘాటించారు. పంచాయతీ ఎనికలకోసం మహిళలకు చీరలు అని కాంగ్రెస్ కపట నాటకం ఆడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండి బి.ఆర్.ఎస్ పార్టీకి అండగా ఉండి స్థానిక సంస్థలలో గెలిపించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పట్ల స్పందించే నాయకులకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అందుకే ప్రజల సమస్యలు తెలుసుకొని అందుబాటులో ఉండాలని సూచించారు.ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కష్టపడి పనిచేస్తే బి.ఆర్.ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశములో నాగం.తిరుపతి రెడ్డి,జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,మాజీ జెడ్.పి.టి.సి.భీమన్న,మాజీ ఎం.పి.పి సేనాపతి,మాజీ వైస్ ఎం.పి.పి మధుసూదన్ రెడ్డి,శివరామి రెడ్డి,ఖాజా,శ్రీనివాస్ రెడ్డి,పాపులు,జగదీష్,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : పరిపాలనను ప్రజల చెంతకు తెచ్చిన ఘనత కె.సి.ఆర్ గారిది )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version