ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా : సినిమాలపై మక్కువతో 27 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. ఈ విధంగా ఎన్నో హిట్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. ఈ విధంగా చిత్ర పరిశ్రమకు ఆయన వంతు అండగా నిలబడి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా చేస్తూ తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి చోట ఆయన కలగజేసుకుంటూ ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం హర్షించదగిన విషయం. (Story:ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్)

