ప్రజల మన్ననను పొందుతున్న రోటరీ క్లబ్
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు రోటరీ క్లబ్ ప్రాధాన్యత ఇస్తుందని, నాగేంద్రుడు మాష్టారు వంటి దాతల సహకారంతో వాటిని నెరవేర్చడంలో కొంత పురోగతి సాధిస్తున్నామని రోటరీ క్లబ్ వినుకొండ అధ్యక్షులు యేరువ వెంకటనారాయణ అన్నారు. ఈపూరు మండలం కొచ్చర్ల బీసీ కాలనీ లో ప్రాధమిక పాఠశాల మరియు వినుకొండ పట్టణం లోని ఇందిరా నగర్ ప్రాధమిక పాఠశాలలకు అవసరమైన మైక్ సెట్లను బుధవారం దాత నాగేంద్రుడు సహకారంతో వినుకొండ రోటరీ క్లబ్ అందించింది. ఈ సందర్భంగా దాత నాగేంద్రుడు మాస్టార్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా ముఖ్యులు ఆలా శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటర్ కూచి రామాంజనేయులు, కొచ్చర్ల గ్రామ పెద్దలు ఐనాల కోటేశ్వరరావు , అంకారావు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.(Story : ప్రజల మన్ననను పొందుతున్న రోటరీ క్లబ్ )

