31 కోట్లు అన్నదాత సుఖీభవ చెక్ ను అందజేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
పంటలు పరిశీలించి రైతులతో కలిసి భోజనం చేసిన చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన రైతు సంక్షేమ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ మరియు ‘పీఎం కిసాన్’ పథకాల రెండవ విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో 85,898 మంది అర్హులైన రైతు కుటుంబాలకు 31.04 కోట్లు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం చెక్కును చీఫ్ విప్ జీవి రైతులకు అందజేశారు. అనంతరం రైతులతో కలిసి పంటలను సందర్శించిన సాగు వివరాలు, ఇబ్బందులు స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్న ఆయన మధ్యాహ్నం రైతులతో కలిసి పొలంలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.(Story : 31 కోట్లు అన్నదాత సుఖీభవ చెక్ ను అందజేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి)

