డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయి ..
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్ తెలుగు / వనపర్తి :
మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “నషా ముక్తా భారత్ అభియాన్” ఐదేళ్ల పూర్తి అయిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని డ్రగ్స్‌ను జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఇతరులను కూడా వాటి నుంచి తప్పించే బాధ్యత వహిస్తామని ప్రమాణం చేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. డ్రగ్స్ యువతను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర విషం. పోలీస్ శాఖ కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, ప్రజల్లో అవగాహన పెంచడం కూడా మా కర్తవ్యం. వనపర్తి జిల్లా డ్రగ్స్ రహితంగా నిలవాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు రావాలి. పోలీసులు ముందుండి నడిపిస్తారు, సమాజం తోడుంటే మేము విజయాన్ని సాధిస్తాం” అని పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిలో అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆన్నారు. ప్రస్తుతం ప్రతి పోలీసు, యువత సైబర్ వారియర్గా పనిచేస్తున్నారు అని ఇకనుండి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు డ్రగ్స్ ఫ్రీ జిల్లా కొరకు ప్రజలంతా పాటుపడాలని ఎస్పీ కోరారు
ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఆర్బి డిఎస్పీ, బాలాజీ నాయక్,వనపర్తి సీఐ, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, రిజర్వు ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(Story:డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయి ..)

