Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జన గణన లో కుల గణన చేపట్టాలి : సిపిఐ

జన గణన లో కుల గణన చేపట్టాలి : సిపిఐ

0

జన గణన లో కుల గణన చేపట్టాలి : సిపిఐ

న్యూస్ తెలుగు / వినుకొండ : దళిత గిరిజన మైనార్టీలపై, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సిపిఐ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం వినుకొండ శివయ్య స్తూపం సెంటర్ లో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, క్రైస్తవుల పైన దాడులు పెరిగిపోయాయని, దేశంలో మతతత్వ పాలన సాగుతుందని, ఆర్. ఎస్. ఎస్ సంఘ పరివార్ కనుసన్నల్లో భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవ్వాయి పై సనాతన వాది దాడి కి పాలు పడిన ఘటన ఒక మచ్చు తునక మాత్రమే అన్నారు. రాష్ట్రంలో దాదాపు 143 వెనకబడిన కులాలు ఉన్నాయి అన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీల కేటాయించలసిన సీట్లు తగ్గించడం వలన వేల సంఖ్యలో బీసీలు పదవులు కోల్పోయారన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి జనగణన తో పాటు కులగన నిర్వహించి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు”. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాయబారం వందనం, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, ఎస్. కె మస్తాన్వలి, దారి వేముల మరీయబాబు, షేక్ కాలేశా, షేక్ నాగూర్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. (Story:జన గణన లో కుల గణన చేపట్టాలి : సిపిఐ)

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version