సకల జన సహపంతి భోజనం..
న్యూస్ తెలుగు/ వినుకొండ : స్థానిక సురేష్ మహల్ రోడ్డు లోని మూర్తి భావి వద్ద గల శ్రీ శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర ఆలయంలో గత నెల రోజులుగా కార్తీక మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ మంగళవారం 10 వేల మందికి సకలజన సహపంతి భోజనం కార్యక్రమం సిహెచ్ఎల్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు సైదారావు, రామ్ కోటేశ్వరరావు, న్యాయవాదులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:సకల జన సహపంతి భోజనం..)

