పార్టీ పటిష్టతకు నేను ఎల్లప్పుడూ సిద్ధమే :చిప్పాడా రామారావు
న్యూస్ తెలుగు/ సాలూరు : రాష్ట్ర నాయి బ్రాహ్మణుల సంఘం మాజీ డైరెక్టర్ చిప్పాడా రామారావు ని సాలూరు నియోజకవర్గం వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులుగా నియమించడంతో ఆయన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ చేతివృత్తుల విభాగం అధ్యక్షులు చిప్పాడ.రామారావు ని సత్కరించి అభినందించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మరియు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధమే అని తెలిపిన చేతివృత్తుల విభాగం అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అధ్యక్షులు రామారావు తో మాట్లాడుతూ మీ సేవలు ఎనలేనివని కొనియాడారు.పార్టీ పటిష్టత కోసం మీరు మరింత ఉత్సాహంతో కృషి చేయాలని తెలిపారు.నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు మాజీ సీఎం జగనన్నకు,మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కి మరియు జిల్లా వైసీపీ పెద్దలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని వారి సూచనలు మేరకు పార్టీ బలోపేతానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని,మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నాయకత్వంలో నేను నడవడానికి ఆయన వెంట ఉండేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని చిప్పాడ.రామారావు తెలిపారు.చిప్పాడ.రామారావు ని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి.సురేష్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు.అప్పలనాయుడు
,జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి.శ్రీను .పట్టణ 22వ వార్డు కౌన్సిలర్ గిరి.రఘు ,మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ పిరిడి రామకృష్ణ ,వైసీపీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story:పార్టీ పటిష్టతకు నేను ఎల్లప్పుడూ సిద్ధమే :చిప్పాడా రామారావు)

