Home వార్తలు తెలంగాణ ”వార్షిక తనిఖీలలో ” భాగంగా ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

”వార్షిక తనిఖీలలో ” భాగంగా ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

0

”వార్షిక తనిఖీలలో ” భాగంగా ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని “వార్షిక తనిఖీలలో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు గారు పూల బుద్ధి అందజేసి స్వాగతం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి . అనంతరం సర్కిల్ కార్యాలయంలో రికార్డ్స్ ను, తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. సర్కిల్ కార్యాలయం పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు, నేరస్థుల ప్రస్తుత పరిస్థితులు ఏవిధంగా ఉన్నవి తదితర వివరాలను పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలనుఆత్మకూరు సీఐ, శివకుమార్ ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసు వ్యవస్థ యొక్క బలం క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠ, పారదర్శకత. వార్షిక తనిఖీలు కేవలం పరిశీలన మాత్రమే కాదు సేవా ప్రమాణాలను ఇంకా మెరుగుపరచే అవకాశం. ప్రజలు పోలీసులపై నమ్మకం ఉంచే విధంగా ప్రతి అధికారి పనిచేయాలి.శుభ్రత, రికార్డులు, స్పందన సమయాలు, ప్రజా సేవలో వినయశీలత ప్రతి పోలీసు అధికారి ప్రధాన ధ్యేయం కావాలి. వనపర్తి జిల్లా ప్రజల భద్రత కోసం మా యంత్రాంగం ఎప్పుడూ సజ్జంగా ఉంటుంది పోలీసు శాఖ శక్తి మా క్రమశిక్షణలో, సేవా నిబద్ధతలో ఉంటుంది. వార్షిక తనిఖీలు ఒక బాధ్యత పరిశీలన మాత్రమే కాదు – ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే మార్గం. ప్రతి పోలీసు అధికారి ప్రజల భద్రత, న్యాయం, విశ్వాసం అనే మూడు ముఖ్య లక్ష్యాలను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుని పనిచేయాలి. సర్కిల్ కార్యాలయంలో శుభ్రత, రికార్డుల పారదర్శకత, స్పందన వేగం, ప్రజలతో వ్యవహరించే తీరు ఇవే పోలీసు శాఖ నిజమైన ప్రతిఛాయ. నేరాల నియంత్రణ కోసం గస్తీ, పహారా మరింత బలోపేతం చేసి, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయడం మనమందరి బాధ్యత. వనపర్తి జిల్లా ప్రజల భద్రత, శాంతి, సౌకర్యం కోసం మా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, ఆత్మకూరు సీఐ, శివకుమార్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. (Story:”వార్షిక తనిఖీలలో ” భాగంగా ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version