Home వార్తలు తెలంగాణ సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుంది

సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుంది

0

సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుంది

ఎమ్మెల్సీ సత్యం

న్యూస్‌తెలుగు/పెబ్బేరు : సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే
ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మం లో డిసెంబర్ 26న జరగనున్న సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవాల ప్రచార జాత శనివారం మధ్యాహ్నం పెబ్బేరుకి చేరుకొంది. సిపిఐ పెబ్బేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి బస్సు జాతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సుభాష్ చౌరస్తాలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ బిజెపి దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెడుతూ సమాజంలో ఆర్థిక సమాన తలను మరింత పెంచుతుందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తుందన్నారు. మతపరమైన చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందుతుందని దీనికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే వందేళ్ళ ముగింపు ఉత్సవాల్లో పార్టీ శ్రేణులు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్రీనివాసులు,పెద్ద మొగులయ్య, శాంతమూర్తి, రిక్షా రాములు, చంద్రయ్య, రాములు, గోవిందు, బాలస్వామి, రవి, గాంధీ
తదితరులు పాల్గొన్నారు. (Story:సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుంది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version