Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు స్వచ్ఛ ఆంధ్ర..

గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు స్వచ్ఛ ఆంధ్ర..

0

గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు స్వచ్ఛ ఆంధ్ర..

న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్పర్సన్ డా.షేక్ దస్తగిరి సూచనలతో గౌరవ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో గల గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర నవంబర్ నెల థీమ్  మన పరిశుభ్రత- మన ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ. వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ ,సామాజిక పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. మనం చేతులు తరుచుగా శుభ్రం చేసుకోవడం వల్ల దాదాపు8 0% రోగాలు మన దరి చేరవని, ప్రతి 100 మందిలో 10 మందికి వచ్చే అంటు వ్యాధులు చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వస్తున్నాయని తెలిపారు. సాయి హాస్పిటల్స్ డా|.ఎస్. అనూష మాట్లాడుతూ. ముఖ్యంగా బాలికలు ఈ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం అని బ్రేస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. తదుపరి ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ. మనం తినే ఆహారం నీరు, కలుషితం అవ్వడం వల్ల టైఫాయిడ్, కలరా , డయేరియా వంటి వ్యాధుల బారిన పడతామని,కనుక మనం,మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు.అలాగే నవంబర్14 జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ విద్యార్థులతో స్వచ్ఛఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెపర్డ్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు శానిటరి సెక్రటరీలు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.(Story:గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు స్వచ్ఛ ఆంధ్ర..)

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version