Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గీతాంజలి ప్రైమరీ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

గీతాంజలి ప్రైమరీ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

గీతాంజలి ప్రైమరీ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక కొత్తపేట గీతాంజలి ప్రైమరీ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. స్వతంత్ర భారత ప్రప్రదమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవ సందర్భంగా మనం బాలల దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నామని, ఆయనకు చిన్నారులు అంటే ఎంతో ఇష్టమని, కాబట్టి చిన్నారులు ఆయన తమపై చూపిన అభిమానానికి చిహ్నంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. కాబట్టి చిన్నారులు బావి భారత పౌరులుగా ఎదగాలంటే మంచి లక్షణాలతో ఉన్నత విద్యలను అభ్యసించి భావి భారత పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా చూపర్లను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story:గీతాంజలి ప్రైమరీ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!