Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాయిబాబా ఆలయంలో పాలాభిషేకాలు

సాయిబాబా ఆలయంలో పాలాభిషేకాలు

సాయిబాబా ఆలయంలో పాలాభిషేకాలు

న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలో ధర్మపురిరోడ్డు వద్ద ఉన్నదత్త సాయి సమర్థ పీఠంలో కార్తీక మాస గురువారం సందర్భంగా దేవాలయంలో ఉన్న షిరిడి సాయిబాబా ఉత్సవ విగ్రహానికి సమర్థ సాయి సుందర మహారాజ్ ఆధ్వర్యంలో రామకృష్ణ శర్మ చేతులు మీదుగా పాలాభిషేకం ఉదయం 5:30 నుండి 10 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అవధూత సాయి సుందర మహారాజ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే మొదటిగా దత్త సాయి సమర్థ పీఠంలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగిందన్నారు. అప్పటినుండి నేటి వరకు అనేక కార్యక్రమాలను నిరంతరం ” నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గురువారం సాయిబాబాకు పాలాభిషేకం, సాయంత్రం పల్లకి ఉయ్యాల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు దేవాలయంలో భక్తుల పేరు, గోత్రలతో రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం, ప్రతిరోజు దేవాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం పాలాభిషేకం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు .(Story:సాయిబాబా ఆలయంలో పాలాభిషేకాలు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!