శంబర పోలమాంబ ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషిచేయాలి
శంబర ఆలయకమిటీ ప్రమాణస్వీకార మహోత్సవంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
న్యూస్ తెలుగు/ సాలూరు : సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో ఉన్న భక్తులు పాలిటి కల్పవల్లి శంబర గ్రామంలో వెలసిన శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ఆలయ కమిటీ వేయగా చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు.అందులో భాగంగా బుధవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి.సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజర య్యారు.ఈ సందర్భంగా పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆలయకమిటీ చైర్మన్ నైదాన.తిరుపతిరావు అలాగే కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతు గతంలో శ్రీ పోలమాంబ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కొన్ని ఇబ్బం దులు ఉండేవని టిడిపి గవర్నమెంట్ లో ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. అలాగే రాబోయే శంబర పండగలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కమిటీ చైర్మన్, సభ్యులు కృషి చేయాలని దానికి అన్నివిధాల సహకారం అందిస్తానని భరోసా కల్పించా రు. మండల నాయకులు గుళ్లా.వేణు, ఆముదాలపరమేశు,గూడేపు.యుగంధర్, నిమ్మాది చిట్టి, సూర్య యాదవ్, కూనిశెట్టి.భీమారావు ఇంకా టిడిపి నాయ కులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు.(Story:శంబర పోలమాంబ ఆలయ అభివృద్ధికి సమిష్టిగా కృషిచేయాలి)

