లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపరాదు..
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
న్యూస్‌తెలుగు/వనపర్తి : 18 సంవత్సరాల వయస్సు నిండకుండా, లైసెన్స్ పొందకుండానే వాహనాలు నడపవద్దని, సరైన శిక్షణ పొందకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
మంగళవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రత్యేక చొరవతో ఐ.డి. ఒ సి సమావేశ మందిరములో వందపర్తి పట్టణంలోని కళాశాల విద్యార్థులకు ట్రాఫిఫ్ మరియు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
లైసెన్స్ లేకుండా వాహనాలు ఎట్టిపరిస్థితిలో నడపవద్దని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెంట్ ధరించాలన్నారు. ట్రిబుల్ రైడింగ్ చేయడం, వాహనాన్ని వేగంగా నడిపి అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, యువత స్టంట్ లు చేయడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల భారత దేశంలో ప్రతి నాలుగు నిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేశారు. వాహనాలు అతివేగంగా నడపవద్దని, యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి, జీబ్రా క్రాసింగ్, డివైడర్ టర్న్ తదితర రోడ్డు నిబంధనల పై యువత అవగాహన కలిగి వుండాలని సూచించారు.
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు తెలియకపోవడం, తెలిసిన వాటిని పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నాయని తెలిపారు. మన దేశంలో సంవత్సరానికి 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని వెల్లడించారు. తల్లిదండ్రులు, భాగస్వామి మన రాకకోసం ఎదురు చూస్తుంటారని, ఎదురుచూపు విశాకరంగా మారిపోవద్దని యువతను హెచ్చరించారు. ప్రమాదాలు జరుగకుండా నివారించేందుకు యువత ముందుకు రావాలని, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలుసుకొని వాటిని పాటించాలన్నారు. యువత ట్రాఫిక్ నిబంధనల పై శిక్షణ పొందటమే కాకుండా తమ జూనియర్లకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సి.ఐ, స్టేషన్ హౌజ్ అధికారులు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు అవగాహన సదస్సులో హాజరయ్యారు. (Story:లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపరాదు..)

