పరుగు పందెం మరియు వాలీబాల్ పోటీలలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన గీతమ్స్ విద్యార్థులు..
న్యూస్ తెలుగు /వినుకొండ :
ఈనెల 7 మరియు 8 తేదీలలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి మరియు జిల్లాస్థాయిలో నిర్వహించిన ఖో ఖో అండర్ 14 మరియు అండర్ 17 విభాగంలో గీతమ్స్ విద్యార్థులు
రాష్ట్రస్థాయిలో గీతమ్స్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ మాలపాటి కృష్ణవేణి తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, చదువుతోపాటు క్రీడలలో కూడా పాల్గొని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని క్రీడాకారులకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు 03 శాతం రిజర్వేషన్ ఉందని ఈ అవకాశాన్ని క్రీడాకారులు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ. అండర్ 14 ఖో ఖో విభాగంలో మువ్వ యోగి రంజిత్ జిల్లాస్థాయిలో అర్హత సాధించి రాష్ట్రస్థాయికి ఎన్నిక కాగా అండర్ 17 విభాగంలో నక్క సాయి చరణ్ రెడ్డి, మారెళ్ళ వెంకట అవినాష్ రెడ్డి అర్హత సాధించారని మరియు అండర్ 17 అథ్లెటిక్స్ పోటీలలో 800 మీటర్ల పరుగు పందెం పోటీలలో నక్క సాయి చరణ్ రెడ్డి ప్రధమ స్థానం సాధించాడని, అండర్ 17 వాలీబాల్ పోటీలలో ఆళ్ల విశాల్ రెడ్డి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక అయ్యాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి లు గోపి, సాల్మన్, అజయ్, సుమంత్, సూర్య పాల్గొన్నారు. (Story:పరుగు పందెం మరియు వాలీబాల్ పోటీలలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన గీతమ్స్ విద్యార్థులు..)

