Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో ఆకాశ దీపోత్సవం

వినుకొండలో ఆకాశ దీపోత్సవం

0

వినుకొండలో ఆకాశ దీపోత్సవం

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక శ్రీనివాస్ నగర్ లో వేంచేసియున్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ నందు గురువారం కార్తీక పౌర్ణమి పుష్కరించుకొని దేవస్థాన అర్చకులు శ్రీనివాసల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకాశదీపం సహస్ర దీపోత్సవం కార్యక్రమం జరిగింది. సహస్రనామార్చన అనంతరం కోలాటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, సెక్రెటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాళ్ళ రామ కోటేశ్వరరావు, మరియు కమిటీ సభ్యులు గుడిపాటి కోటేశ్వరరావు, అన్న వీరబ్రహ్మం, కొత్త మాస్ పెద్ద రాములు, అన్నా సుబ్బారావు, చితిరాల పుల్లారావు ఆలయ సిబ్బంది నరేంద్ర వాసు నాగేశ్వరరావు పాల్గొన్నారు.(Story:వినుకొండలో ఆకాశ దీపోత్సవం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version