Home వార్తలు తెలంగాణ ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధం

ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధం

0

ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధం

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజా వాతావరణం ప్రశాంతంగా కొనసాగించేందుకు నవంబర్ 01 నుండి నవంబర్ 30 వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం జిల్లాలో డిఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, లేదా ప్రజలు గుమికూడే కార్యక్రమాలు నిర్వహించడం కఠినంగా నిషేధం అని స్పష్టం చేశారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే బహిరంగ సమావేశాలు పూర్తిగా నిషేధించబడతాయి. చట్టపరమైన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే, 30 పోలీస్ యాక్ట్ – 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని ఎస్పీ గారు హెచ్చరించారు.
జిల్లా పోలీస్ విభాగం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు లేదా ధర్నాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఎస్పీ గారు స్పష్టం చేశారు. “ప్రజా శాంతి భద్రతల పరిరక్షణే మా ప్రధాన బాధ్యత. నిబంధనలు అందరూ పాటించాలి. ఉల్లంఘనలకు చట్టం ముందుందని ఎస్పీ అన్నారు.(Story:ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version