మొంథా తుఫానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మండలం విఠంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామలలో మొంథా తుఫాను కారణంగా వందలాది ఎకరాల్లో వర్షపు నీరు చేరి రైతుల పంటలు నీట మునిగి వుడగెత్తిపోయాయి. నేటి వరకు ప్రభుత్వ అధికారులు కనీసం రైతుల పొలాలను పరిశీలించలేదని, కంటా రంగారావు 75 సెంట్లు చిక్కుళ్ళు, 75 సెంట్లు దోశలు ఈ తుఫాను వలన నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాల శంకర్ రావు ఎకరాలు కంది పంట తుఫాను వల్ల పంట వుడకెత్తి నష్టం జరిగిందన్నారు. భవనం కోటిరెడ్డి, సుందర్ రెడ్డి, కంఠ వెంకటేశ్వర్లు, గోరుచిక్కుడు పోలాలు ఉడగెత్తిపోయాయి. నిసంకి వెంకటేశ్వర్లు మూడు ఎకరాలు గుమ్మడి కాడ పంట నష్టపోయానని తెలియజేశారు. తుఫాను కారణంగా పొలంలో నీరు నిల్వ ఉండటంతో సొరకాయలు, కంది, గోరుచిక్కుడా, గుమ్మడి తదితర పంటలు వేసిన రైతులు నష్టపోయారు. ప్రభుత్వ అధికారులు విఠంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో పర్యవేక్షించి పంట నష్టాలు వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. సుమారు ఒక్కో ఎకరానికి 35 వేల రూపాయలు చొప్పున నష్టపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలను పరిశీలించిన వారు పిడిఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, రైతులు కంఠా రంగారావు, పగడాల చినకోటిరెడ్డి, నిసంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story:మొంథా తుఫానుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి)

