సాలూరులో ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి
న్యూస్ తెలుగు/సాలూరు : ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి సాలూరు పట్టణంలో జరిగింది. ఈరోజు శనివారం కావడంతో కార్తీక్ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అయినందున పట్టణంలో ఉన్న వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. కొంకి వీధిలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం. సాలూరు శ్రీనివాస్ నగర్ లో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఉదయం నాలుగు గంటల నుండి ఆలయానికి చేరుకుని స్వామివారులను ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్త మండల సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు, భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు . (Story :సాలూరులో ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి)

