వైసిపి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కు ఘన నివాళులు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళిర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహా పురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. దేశభాషల సమున్నతికి ఆత్మబలిదానం గావించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అని, భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి సేవలను గౌరవం ఇస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశారన్నారు. స్వతంత్ర సమరయోధుల పైన జగన్మోహన్ రెడ్డి కి ఉన్న గౌరవం అలాంటిదన్నారు.(Story :వైసిపి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కు ఘన నివాళులు )

