ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు
న్యూస్ తెలుగు/ వినుకొండ : జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో శనివారం వినుకొండ లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జిడిసిసి బ్యాంక్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు, ఆర్యవైశ్య పెద్దలు, తదితరులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం సాధించి. 58 రోజులు ఆమర నిరాహార నదీక్ష చేసి ప్రాణాలర్పించారని గుర్తుచేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆయనను ఆదర్శంగా నేటి యువత తీసుకోవాలని కొనియాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర అమరావతిలో శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే పెనుగొండ పట్టణాన్ని వాసవి పెనుగొండ గా మార్చడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. పొట్టి శ్రీరాములు స్మృతి వనం, వాసవి పెనుగొండ పట్టణంగా మార్చడం పట్ల గుడివాడ చిన్న గురునాథం ఆర్యవైశ్య సంఘం తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులుకు, జీడీడిసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జున రావు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ చైర్మన్ షకీలా దస్తగిరి, మోటమర్రి నరసింహారావు, పువ్వాడ కృష్ణ, రెడ్డి వెంకటరత్నం, మేడం రమేష్, ఇమ్మడిశెట్టి రమేష్, బొంకూరి రోశయ్య, గజవల్లి నాగ పవన్, పల్ల మీసాల దాసయ్య,పివి సురేష్, అచ్చుత కోటేశ్వరరావు, తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. (Story :ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు)

