ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన జీవి..
న్యూస్ తెలుగు /వినుకొండ : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు భరోసాగా నిలుస్తున్నాయని, అభివృద్ధి సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని 15వ వార్డ్ శాలివాహన నగర్లో మరియు నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. నగర్ లోని పలువురు వృద్ధులకు ఆయన స్వయంగా పింఛన్లు అందజేశారు. సూపర్ సిక్స్ హామీలన్నీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story:ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన జీవి..)

