నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నారాయణ స్కూల్ నందు శనివారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఎజిఎం లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. ఏ పాఠశాలలో లేనివిధంగా తమ నారాయణ విద్యావ్యవస్థలో విద్యార్థుల పట్ల అంకిత భావంతో కూడిన విద్యా ప్రణాళిక రూపొందించమని, విద్యార్థులకు అర్థవంతమైన రీతిలో లెసన్ ప్లానింగ్ ద్వారా తరగతులు నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం గడిచిన ఐదు నెలల్లో విద్యార్థులు వారు నేర్చుకున్న విద్యను ప్రాజెక్ట్ రూపంలో రూపొందించి దానికి సంబంధించిన సమాచారాన్ని పాఠశాలకు విచ్చేసిన అతిధులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు క్షుణ్ణంగా వివరించారని పాఠశాల ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ డి హెడ్ వాణి , కోఆర్డినేటర్ గౌస్య , ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి ,వైస్ ప్రిన్సిపల్ రాగ సుధా, పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. (Story:నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్..)

