స్టూడెంట్స్ అసెంబ్లీ పోటీలకు ఎంపికైన నందిని
న్యూస్ తెలుగు/ సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సాలూరు నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన పోటీలలో సాలూరు పట్టణంలోని కొల్లి అప్పలనాయుడు మున్సిపల్ హై స్కూల్(గాడివీధి) 10వ తరగతి విద్యార్థిని కొల్లి నందిని స్టూడెంట్స్ అసెంబ్లీ కార్యక్రమానికి ఎంపికైంది. శనివారం సాలూరు పట్టణంలోని కేహెచ్ హైస్కూల్లో హెచ్ఎం బి గోవింద ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలను నిర్వహించారు. మండల స్థాయిలో ఇప్పటికే నిర్వహించిన ఈ పోటీలలో గెలుపొందిన ముగ్గురేసి విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల్లో కొల్లి నందిని మూడు విభాగాలలోనూ ప్రథమ స్థానంలో నిలవగా మిగిలిన రెండు స్థానాలలో సాలూరు మండలం పెదబోరబంధ జడ్పీ హైస్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థి కోండ్రు తనూజ, మక్కువ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని లెంక సాయి సౌమ్య నిలిచారు. న్యాయ నిర్ణీతలుగా సీనియర్ ఉపాధ్యాయుడు కొనిసి గౌరీ శంకరరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, లావుడి వెంకటేశ్వరరావు ఒకేషనల్ టీచర్ గౌరీశంకర్ వ్యవహరించారు. విజేతలను సాలూరు మండల ఎంఈఓ 2 ఎన్ వెంకటరావు తదితరులు అభినందించారు.(Story :స్టూడెంట్స్ అసెంబ్లీ పోటీలకు ఎంపికైన నందిని )

