వినుకొండ 15వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభించిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక 15వ వార్డు పాటిమీద బజార్ ప్రాంతంలో రూ.8 లక్షల కు పైగా వ్యయంతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్డును ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి వార్డులోనూ అవసరాలను గుర్తించి, దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల వసతులతో నగరాన్ని సవ్యంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, అభివృద్ధి పనులు నియోజకవర్గం అంతటా వేగవంతంగా కొనసాగుతాయని చీఫ్ విప్ జీవీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.(Story : వినుకొండ 15వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభించిన ప్రభుత్వ )

