మహిళల ఆరోగ్య పరిరక్షణ కు సఖి సురక్ష హెల్త్ స్కీం
న్యూస్ తెలుగు /సాలూరు : మహిళల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సఖి సురక్ష హెల్త్ స్కీం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు శుక్రవారం సాలూరు పట్టణంలో గల సీతారామ కల్యాణ మండపం, 6వ వార్డ్ దాసరివీధి లో సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆరోగ్య ఉండాలని ప్రభుత్వ జేయమని అన్నారు. మహిళలు పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సఖి సురక్ష హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. మహిళలకు ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యతను వివరించారు.
మహిళలకు రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్ స్థాయిలు, రక్తపరీక్షలు, స్తన క్యాన్సర్, గర్భాశయ సంబంధిత క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయని తెలిపారు. ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మహిళల ఆరోగ్యం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే, ఆర్థిక సుస్థిరత మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యం కూడ ఎంతో ముఖ్యం అని, ప్రభుత్వ పథకాల సద్వినియోగం చేసుకొని మహిళలు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కొనిసి వరలక్ష్మి , వైదేహి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, కాళ్ళ శ్రీనివాసరావు, పప్పల మోహన్ రావు , కునిశెట్టి భీమారావు ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.(Story:మహిళల ఆరోగ్య పరిరక్షణ కు సఖి సురక్ష హెల్త్ స్కీం)

