Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

0

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయుధాల్లో ఏకే 47, 2ఇంచ్ మోటర్, 303, రైఫిల్స్, ఇన్సాస్, వాటి వినియోగం గురించి సోదాహరణంగా వివరించారు. అలాగే వాకి టాకీ, డ్రోన్ కెమెరా లు వినియోగం, అది పనిచేసే విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ఏపీ ఆర్ ప్రిన్సిపాల్ కు, ఏపీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు, శ్రీ భాస్కర విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ వేణుగోపాల్ కు జ్ఞాపికలను అందజేశారు. అలాగే పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి మెమొంటో లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ గోపాలకృష్ణ, ఎస్సై పి రమేష్, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దివాకర్, ఏఎస్ఐ దొర, పోలీస్ సిబ్బంది,సి ఆర్ పిఎఫ్ సిబ్బంది, ఏఎన్ఎస్ పార్టీ స్పెషల్ పోలీసులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story:పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version