Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ భూములు కాపాడాలంటూ వినుకొండ లో ధర్నా..!

ప్రభుత్వ భూములు కాపాడాలంటూ వినుకొండ లో ధర్నా..!

ప్రభుత్వ భూములు కాపాడాలంటూ వినుకొండ లో ధర్నా..!

– 2.కోట్లు విలువ చేసే ప్రభుత్వభూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్, వినుకొండ పట్టణ కమిషనర్ ఆదేశాలను లెక్కచేయని ఆక్రమణదారులు

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణం లో కోట్లాది రూపాయల భూమి కబ్జా చేశారు కాపాడండి అంటూ వినుకొండ క్రిస్టియన్ పాలెం కు చెందిన ప్రజలు స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్ళు గా ఆ ప్రాంతంలో మహిళ ల కొరకు సామూహిక మరుగుదొడ్లు అప్పటి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిందని ఆ మరుగుదొడ్లు కూల్చి వేసి అక్రమణ చేశారని అప్పటి మున్సిపల్ కమిషనర్ కేసు నమోదు చేసి పెన్సింగ్ వేశారని మరలా ఆక్రమణ చేశారని ప్రభుత్వ అస్తి కాపాడి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. వివరాలు పరిశీలిస్తే వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణం ప్రస్తుత 27 వ వార్డు క్రిస్టియన్ పాలెంలో సర్వే నెంబర్ 390/1ఏ 1లో షుమారు రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి గ్రామాకంఠం ఉన్నది. ఈ భూమి విలువ సుమారు ప్రభుత్వ విలువ 2 కోట్లుగా బహిరంగ మార్కెట్ లో 10 కోట్లు గా ఉంటుంది.గత కొన్ని సంవత్సరాలు క్రిందట క్రిస్టియన్ పాలెం, ఒబయ్య కాలనీ, ముస్లిం బిసి యస్ టి వర్గాల మహిళలతో పాటు వార్డు మహిళలు బహిర్భూమి అవసరాల నిమిత్తం కొరకు అప్పటి ప్రభుత్వం మరుగుదొడ్డుని నిర్మించింది. ఆక్రమణదారులకి ఎప్పటినుండో ప్రభుత్వ స్థలం మీద కబ్జా చేయాలని కన్ను ఉంది వారు సుమారు ఐదు సంవత్సరాల క్రిందట అక్కడ నిర్మించిన మరుగుదొడ్డిని మరియు క్రిస్టియన్ పాలెం వాసులకు చెందిన కొందరి సమాధులను జె.సి.బి సహాయంతో పడగొట్టారు మేకా రాజగోపాల్ అనే రియల్టర్ ఈ ఆక్రమణ లకు వెన్ను దన్నుగా నిలిచి ఆక్రమణదారులతో కోట్ల రూపాయలకు ఒప్పందాలు చేసుకుని ఆక్రమణ చేశారు. స్థానికులు ఆదోళన లు చేయడం తో అప్పటి కమీషనర్ బి.శ్రీనివాసరావు ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు నమోదు కు టౌన్ పోలీసులకు లేఖ రాశారు. ఇది ప్రభుత్వ భూమి అని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు CR.NO 187/2019 నమోదు జరిపించారు. అప్పటి కమిషనర్ బి.శ్రీనివాస్ రావు ఈ భూమిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కట్టాలని ప్రపోజల్ చేశారు. ఈ కేసు లో పోలీసులు ఛార్జ్ షిట్ దాఖలు చేశారు వినుకొండ కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. ఆక్రమణదారులు గత సెప్టెంబర్ నెలలో 19వ తేదీన కొందరు ఆక్రమణదారులు జె.సి.బి మరియు ట్రాక్టర్స్ తో మరలా దురాక్రమణ చేశారు. ఈ విషయం పై స్థానికులు అనేకమార్లు ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ని కలిశారు. ఆ భూమి క్రిస్టియన్ పాలెం వార్డు ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగిస్తానుని హామీ ఇచ్చారు. కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ కు విచారణ కు ఆదేశించారు. వినుకొండ కమిషనర్ గారు ఇది ప్రభుత్వ భూమి అన్ని బోర్డు ఏర్పాటు చేసి పత్రికా ప్రకటన విడుదల చేశారు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ స్థలం స్వాదినం చేసుకునేటప్పుడు పోలీస్ బందోబస్త్ ఇవ్వాలని లేఖ పంపారుఅయినప్పటికీ ఆక్రమణదారులు ఆ బోర్డును తొలగించి యదేచ్చగా ప్రభుత్వ భూమిలో పగలు మరియు రాత్రి పనులు చేసుకుంటున్నారు స్థానిక ప్రజలలు వారిని ప్రశ్నిస్తే చంపుతాం అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అధికారులు స్పందించి క్రిస్టియన్ పాలెం లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు మున్సిపల్ కార్యాలయం ఎదుట కూర్చుని ప్రభు త్వ భూమి కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి క్రిస్టియన్ పాలెం వాసులు అక్కడ ఫంక్షన్లు గాని మీటింగులు జరుపుకోవడానికి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని చీఫ్ విప్ జీ వీ ఆంజనేయులు ను అధికారులను వేడుకుంటున్నారు. (Story:ప్రభుత్వ భూములు కాపాడాలంటూ వినుకొండ లో ధర్నా..!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!