Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు 

ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు 

0

ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు 

న్యూస్ తెలుగు /వినుకొండ : ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం వినుకొండ మునిసిపాలిటీ ఆఫీస్ ఎదురు ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఏఐటీయూసీ సీనియర్ నాయకులు రాయబారం వందనం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ముంబై నగరంలో ఆవిర్భవించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రిటిష్ వాళ్ళని దేశం నుండి తరిమికొట్టడంలో కీలకపాత్ర పోషించిందని, దేశం కోసం అనేకమంది ప్రాణ త్యాగాలు, రక్తతర్పణం చేసిందని, 8 గంటల పని దినాలు కార్మికుల చట్టాలు సాధించడంలో అలుపెరుగని పోరాటం చేసిందని కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలు నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకు నేటి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసిందని సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విలంబిస్తున్నాయని వాటిని తిప్పి కొట్టాలని ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొండ్రముట్ల సుభాని, రాచపూడి ఏసుపాదం, సంపెంగుల అబ్రహం రాజు, పచ్చిగొర్ల ఏసు, కంచర్ల కోటేశ్వరరావు, బాబురావు, కొప్పరపు మల్లిఖార్జున, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.(Story:ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version