తుఫాను బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ
న్యూస్ తెలుగు/సాలూరు అక్టోబర్ 30 : పునరావస్ కేంద్రంలో ఉన్న తుఫాను బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాజా తుఫాను ప్రభావంతో సురక్షిత ప్రదేశాలకు తరలించిన ప్రజల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస చర్యలలో భాగంగా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పునరావాస కేంద్రాలలో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు సహాయ సామగ్రిని అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మొత్తం 159 కుటుంబాలకు ఈ సహాయం అందించబడగా, అందులో సాలూరు నియోజకవర్గానికి చెందిన 79 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. తుఫాను కారణంగా తమ నివాస ప్రాంతాల నుండి తరలించబడి పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలను చేపట్టిందని ఆమె పేర్కొన్నారు.ప్రతి కుటుంబానికి కింద పేర్కొన్న నిత్యవసర సరుకులు అందజేశారు:25 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ పామ్ ఆయిల్,1 కేజీ కంది పప్పు,1 కేజీ ఉల్లిపాయలు,1 కేజీ బంగాళాదుంపలు పంపిణీ చేశారు.తుఫాను అనంతరం పునరావాస కేంద్రాలలో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక వసతులను నిరంతర పర్యవేక్షణతో అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకునే వరకు ప్రభుత్వం ఎలాంటి లోటు లేకుండా సేవలను కొనసాగిస్తుందని ఆమె స్పష్టంచేశారు.అత్యవసర సందర్భంలో ప్రజలు భయపడకుండా, ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి సహకరించాలని మంత్రి కోరారు. తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించే దిశగా ప్రతీ చర్య తీసుకుంటామని ఆమె తెలిపారు. పునరావాస కేంద్రాలలో ఉన్న చిన్నారులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించనున్నట్లు కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆశ్ర వైశాలి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్, తాసిల్దార్ నీలకంఠేశ్వరరావు, ఎంపీడీవో జి పార్వతి, సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మ తిరుపతిరావు, వైకుంటపు, హర్ష, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.(Story : తుఫాను బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ )
