Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు

వరద బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు

0

వరద బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి మెంబర్ , వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాలు మేరకు వినుకొండ మొంధా తుఫాన్ కారణంగా వినుకొండ పట్టణంలోని పలు చోట్లా జలమయమై నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ కొత్తమసు శివ, ప్రముఖ న్యాయవాది – పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం. ఎన్ ప్రసాద్, నియోజవర్గ స్థాయి నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రాంత వాసుల కుటుంబాలకు ఆహార పొట్లాలు అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను తొలగించి, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్లనే సకాలంలో సహాయక చర్యలను చేపట్ట లేకపోయిందని , గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది చేత దెబ్బతిన్న ఇళ్లను సర్వే చేయించి వారికి ఆరువేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తుఫాను ప్రభావిత ప్రాంతమైన వినుకొండ పట్టణంలో పలుచోట్ల ఆహార పొట్లాలను మరియు మంచినీటి బాటిళ్లను అందజేశారు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో శావల్యాపురం మండలం, నూజెండ్ల మండలం, వినుకొండ రూరల్ మండలం, బొల్లాపల్లి మండలం, ఈపూరు మండలం లో అనేక ప్రాంతాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయని, తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి. మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు.(Story : వరద బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version