అన్నదాన కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిచ్చన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో గురువారం కార్తీక మాసం రెండవ రోజున భగిని హస్త భోజనం ను లక్ష్మీనరసింహస్వామి ఆడపడుచులకు దేవస్థాన సాంప్రదాయం లతో మహిళా భక్తులందరికీ పసుపు కుంకుమ, అమ్మవారి ప్రసాదంగా, అన్నాచెల్లెళ్లకు అనుబంధంగా నిర్వహించే భగిని హస్త భోజనాన్ని సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా జనసేన నాయకురాలు ఉషా మాట్లాడుతూ. ఈ యొక్క సాంప్రదాయం సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయ విలువలని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రతినిత్యం నిత్యం జరిగే ఈ దేవస్థానంలో ఇటువంటి మహత్తరమైన కుటుంబ విలువలతో కూడిన కార్యక్రమాలను చేస్తున్న మాల్యాద్రి వారి యొక్క సహచర సేవకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా కార్తీకమాసాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని స్పటిక శివలింగానికి ప్రతినిత్యం తెల్లవారుజామున 4: 15 నిమిషాలంకు బ్రహ్మ ముహూర్తంలో అభిషేక కార్యక్రమాన్ని ప్రతి భక్తులచే స్వయంగా చేసే మహద్భాగ్యాన్ని వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నామని మాల్యాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మహిళ ముఖ్య సేవకులు ఏటుకూరి కృష్ణవేణి, విడతల రమ, పత్తి భ్రమరాంబ, తిరువాయిపాటి సరోజినమ్మ, గంగిశెట్టి నాగలక్ష్మి, కాకుమను రామారావు, బద్దిక నరసింహారావు, హనుమంత సూరి, సాయి మాస్టర్ టైల్స్ సురేష్ కుమార్, భక్త బృందం పాల్గొన్నారు.(Story : అన్నదాన కార్యక్రమం)

