Homeవార్తలుతెలంగాణప్రశ్నించటం, పోరాడటం నేర్పిందే సిపిఐ

ప్రశ్నించటం, పోరాడటం నేర్పిందే సిపిఐ

ప్రశ్నించటం, పోరాడటం నేర్పిందే సిపిఐ

న్యూస్ తెలుగు/వనపర్తి :వందేళ్లలోదేశ పేదలకు, బాధితులకు ప్రశ్నించటం, పోరాడటం నేర్పిందే సిపిఐ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ అన్నారు. బుధవారం వనపర్తి శ్వేతా నగర్ కామ్రేడ్కటికనేని గోపాల్ రావు భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం కే శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా కామ్రేడ్ బాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ.. వందేళ్లలో సిపిఐ ఏమిచ్చిందని కొందరు విమర్శ చేస్తుంటారని, పేదలకు బాధితులకు ప్రశ్నించటం పోరాటం న్యాయం పొందటం నేర్పింది సిపిఐ మాత్రమే అన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా కష్టజీవులకు అండగా సిపిఐ పోరాడి వారి కనుకూలంగా చట్టాలను తెచ్చిందన్నారు.ఖమ్మంలో డిసెంబర్ 26న సిపిఐ వందేళ్ళ విజయోత్సవ సభ జరగనుంది అన్నారు. దేశ స్వాతంత్ర కోసం, తెలంగాణ విముక్తి కోసం,తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సిపిఐ అలుపెరుగని పోరాటం చేసిందన్నారు‌. ప్రజా పోరాటాలతో పేదలకు భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ ,ఉపాధి హామీ పథకం, వంటి వాటి ని ఎన్నో సాధించిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కార్మికులకు కనీస వేతనం వంటి చట్టాలు సాధించిందన్నారు. వందేళ్ళ విజయోత్సవ నేపథ్యంలో సాధించిన విజయాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించేందుకు గద్వాల జోడేఘాట్ బాసర నుంచి ప్రచార జాతాలు బయలుదేరి డిసెంబర్ 26న జరగనున్న విజయోత్సవ సభకు చేరుకుంటాయన్నారు.గద్వాల నుంచి బయలుదేరిన వనపర్తి జిల్లా లో 6 మండలాలు, నారాయణపేట3, మహబూబ్నగర్ 4, గద్వాల్ 2, నాగర్ కర్నూల్ 6 మండలాలలో పర్యటించి ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్రంలో సిపిఐ విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రజా పోరాటాల్లో సిపిఐ ప్రత్యేక పాత్రను ప్రజలు గుర్తించారన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు వివరించి ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మంలో మూడు లక్షల మందితో విజయోత్సవ సభ జరుగుతుందన్నారు. ఖమ్మం, కొత్తగూడెం లో నుంచే 80 వేల మంది పాల్గొంటారన్నారు. వనపర్తి జిల్లా నుంచి 300 మంది ఖమ్మం విజయోత్సవ సభలకు హాజరవుతారన్నారు. వందేళ్ళ ఉత్సవ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరై సందేశాలు ఇస్తారన్నారు. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఖమ్మం లో వందేళ్ళ సభ జరుగుతుందన్నారు. ప్రజల మధ్య మతం పేరుతో ఐక్యతను దెబ్బతీసే ఆర్ఎస్ఎస్ కూడా వందేళ్ల సభను జరుపుకోబోతోందన్నారు. విప్లవ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చిన నక్సలైట్లు దశలవారీగా ప్రభుత్వానికి సరెండర్ అవుతూ ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు దిశా నిర్దేశం చేసే సిపిఐ వందేళ్ళ ఉత్సవాలకు ప్రత్యేకత ఉందని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, చంద్రయ్య, రమేష్, రాబర్ట్, మోష, శ్రీహరి, రవీందర్, గోపాల్, గోపాలకృష్ణ, కుతుబ్ కుర్మయ్య, కృష్ణవేణి, గీత తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రశ్నించటం, పోరాడటం నేర్పిందే సిపిఐ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!